Farmer unions against the new agriculture laws announced on Tuesday that they will send teams to election-bound states to ask people to vote against the Bharatiya Janata Party, ANI reported. Elections to the Assemblies of Assam, Tamil Nadu, Kerala, West Bengal and Union Territory of Puducherry, will be held from March 27 till April 29.
#5StatesAssemblyElections
#NewAgricultureLaws
#pollboundstates
#BJP
#Farmerunions
#Farmlaws
#TamilNaduAssemblyElections
#WestBengalAssemblyElections
#PMModi
వివాదాస్పద వ్యవసాయ చట్టాలు బీజేపీకి మరింత ఇబ్బందులు తెచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు మూడు నెలల మైలురాయిని దాటాయి. చట్టాలను వాపస్ తీసుకునేదాకా కదలబోమంటోన్న రైతులు.. చర్చలకు సిద్ధమంటూనే ఆ దిశగా అడుగేయని సర్కారు తీరుతో పరిస్థితి అదే రకంగా కొనసాగుతోంది. దీంతో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ రైతు సంఘాలు భారీ ప్రణాళిక సిద్ధం చేశాయి.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించేందుకు ఆందోళన చేస్తున్న రైతులు పిలుపునిచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు తమ కార్యకర్తలను పంపించి బీజేపీ అభ్యర్థుల్ని ఓడించేందుకు కృషి చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్బీర్ ఎస్ రాజేవాల్, స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్ అన్నారు. మంగళవారం ఆందోళన జరుగుతున్న ఢిల్లీ సరిహద్దులో మీడియాతో మాట్లాడుతూ నేతలు ఈ మేరకు ప్రకటనలు చేశారు.